ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్‌ బాధ్యతలు

Feb 4,2024 11:55 #amarapali, #IAS

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కె. ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. దానకిశోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతో పాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ ఎండీగా ఉన్నారు.

➡️