బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కి హైకోర్టు నోటీసులు

Mar 22,2024 11:05 #BRS MLA, #high court, #notices

తెలంగాణ : అలంపూర్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్‌ వేశారని, విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్‌.ప్రసన్నకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో విజయుడు తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయుడు ఆధారాలేవీ సమర్పించలేదని, నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందని ప్రసన్న కుమార్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి విచారణ చేపట్టి … బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేశారు.

➡️