స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం

Feb 19,2024 15:32 #fire acident, #Telangana

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ ఐరన్‌ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్‌ నగర్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

➡️