కొడాలి నాని, వంశీలతో సంబంధాలు లేవు: బోడే ప్రసాద్

Mar 21,2024 12:07 #bode prasad, #press meet, #TDP

ప్రజాశక్తి-పెనమలూరు : కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవని బోడే ప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ టికెట్‌ నాకే వస్తుందని నమ్ముతున్నానని.. అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధార పడి ఉంటుందని తెలిపారు. బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నాను.. నాకంటే బెటర్‌ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ ఐవిఆర్‌ఎస్‌ సర్వే చేస్తున్నారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఖచ్చితంగా టికెట్‌ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం.. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా అని వంశీ అన్నాడని గుర్తు చేశారు. నేను వంశీతో మాట్లాడటం కలవటం జరగలేదు.. ఇది జరిగిందని ఎవరైనా చెబితే దమ్ముంటే వాళ్ళు నిరూపించాలని సవాల్‌ చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలు ఉంటే నేను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.

➡️