తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? : పవన్‌ కల్యాణ్‌

అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైసిపి సర్పంచి అనుచరుడు ట్రాక్టరుతో ఢకొీట్టి చంపేసిన ఘటనపై పవన్‌ స్పందించారు. తాగునీటికి కూడా పార్టీలు లెక్కలు చూసే పరిస్థితి దురదఅష్టకరమని ధ్వజమెత్తారు. ‘సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన తనను కలచివేసిందన్నారు. తాగునీటి కోసం వెళితే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అడ్డుకుంటారా ? నీళ్లు లేవని ప్రాథేయపడినా… ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి ? అని నిప్పులుచెరిగారు. ” ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారు… ఇలా చేసే వారికి నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా? ” అని పవన్‌ ప్రశ్నించారు.

➡️