కవిత అరెస్టుకు నిరసనగా … బిఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు

Mar 16,2024 11:39 #against, #brs, #Kavitha arrest, #Protest

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా … తెలంగాణలో పలు చోట్ల బిఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా కవితను అరెస్టు చేయించిందని.. వెంటనే ఆమెను విడుదల చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. మేడ్చల్‌ 44వ రహదారిపై రాస్తారోకో చేపట్టిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్‌ చౌరస్తా, దుబ్బాక బస్టాండ్‌లో బిఆర్‌ఎస్‌ నేతలు నిరసన చేపట్టారు.

➡️