ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 13,2024 08:40 #inter student, #Suicide

ప్రజాశక్తి -యంత్రాంగం : ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ముగ్గురు బలవన్మరణానికి యత్నించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాలకు చెందిన రజిత (17) పట్టణంలోని ఓ ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మఠం గ్రామానికి చెందిన గంగోత్రి, రామకుప్పం మండలం సింగసముద్రానికి చెందిన మిత్ర, విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన ముడసల జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

➡️