ఉపముఖ్యమంత్రి ఇలాకాలో అక్రమాలు

Feb 21,2024 10:54 #anakapalli, #cpm, #Irregularities, #YCP Govt
Irregularities in Deputy Chief Minister Ilaka
  •  అక్రమ చేపలు చెరువుల యజమానులు బరితెగింపు
  • చేపలు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలి సిపిఎం

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోనే దారుణమైన పరిస్థితులు నెలకున్నాయని అక్రమ చేపలు పెంపకందార్లు, బరి తెగింపుకు పూనుకుంటున్నారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర డిమాండ్ చేసారు. బుధవారం దేవరాపల్లి మండలంలోని కోత్త పెంట కలిగోట్ల ములకాలాపల్లి పెదనందిపల్లి తారువా గ్రామాల్లో అక్రమంగా చేపాడుతున్న చేపలు చేరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. దేవరాపల్లి మండలంలోని దాదాపుగా వెయ్యి ఎకారాల్లో అక్రమ చేపలు చెరువులు తవ్వకాలు చేపట్టారని ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేవన్నారు. ఇతర జిల్లాలకు చేందిన వ్యాపారులు అక్కడ ప్రజలు రైతులు ఇటువంటి పెంపకాలను వ్యతిరేఖించడంతో ఇక్కడ రైతులకు డబ్బులు అశ చూపించి భూములు లీజులకు తీసుకోని, అక్రమంగా చేపలు చేరువులు తవ్వకాలు చేపాట్టారని తెలిపారు. లాభాలు కోసం ప్రజలు ప్రాణాలతో చేలగాటం అడుతూ, వీటి పెంపకంకోసం పసుమాంసం చీకెన్, వ్యర్థాలు చని పోయిన గోర్రెలు మేకలను బ్రాండ్ క్సే ఇతర కంపినీళ్ళో క్యాంటీన్ లో వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేపాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. విటిని తిన్న ప్రజలు ఆనారోగ్యం పాలు అవుతున్నారని తెలిపారు. ఈప్రాంతంలోని రైవాడ ప్రాజెక్టు ఉండంతో నీళ్ళును చేపలు చేరువలకు వాడుకుంటు వ్రుదా నీటిని క్రింది పోలాలకు వదిలి పెట్టడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో విటిపై రెవెన్యూ పోలీసు పీసరింగ్ ఇరిగేషన్ అదికారులు నిఘా ఉండెదని ఉపముఖ్యమంత్రి సోంతమండలం అవ్వడంతో అదికారులు భయపడి పూర్తిగా వదిలి పెట్టె సారని తెలిపారు. దింతో చేపలు పెంపకం దార్లు పూర్తిగా బరి తెగింపుకు పూనుకోని విచ్చలవిడిగా చీకెను పసుమాంసం వ్యర్థాలను చేపలు చేరువుల్లో గ్రైయిండింగ్ మిషన్లు పెట్టి గ్రైయిండింగ్ చేసి చేపలకు వేస్తూన్నారని తెలిపారు. గతంలో పోలీసులు విజిలెన్స్ అదికారులు ప్రత్యేక నిఘా పెట్టి గ్రైయిండింగ్ మిషన్లు, బెల్టులు తీసుకువచ్చేయడం వ్యర్ద పదార్దలును తరలించిన వాహనాలను పట్టుకోని కేసులు నమోదు చేసేవారని తెలిపారు. ప్రస్తుతం, అదికార పార్టి, నాయుకులకు మామ్మూళ్ళో తప్ప ప్రజలు ప్రాణాలు లెక్కలేదని తెలిపారు. ఇంతటి దౌర్బగ్యపు పరిస్థితులు జిల్లాలోని మరెక్కడా లెవన్నారు. అక్రమ సంపాదనలకు అశపడి అదికార పార్టీ నాయకులు చేపలు చేరువులు యాజమానులు కోమ్ము కాస్తున్నారని తెలిపారు.  వెంటనే చేపలు చేరువులపై ఉన్న గ్రైయిండింగ్ మిషన్లు వెంటనే తోలగించాలని అనుమతులు లెని చేపలు చేరువులు పెంపకందార్లపై క్రిమినల్ కేసులు పెట్టి వ్యర్ధపదార్ధాలు నివారణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.

 

➡️