గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది

Dec 26,2023 08:45 #Daggubati Venkateswara Rao
  • గెలిచుంటే తలదించుకోవాల్సి వచ్చేది
  • దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

ప్రజాశక్తి – కారంచేడు (బాపట్ల జిల్లా) : గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరుఫున పోటీ చేసిన తాను ఓడిపోవడమే మంచిదైందని, పొరపాటున గెలిచి ఉంటే ఎటువంటి అభివృద్దీ చేయలేక ప్రజల్లో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులోని చిన్న వంతెన సెంటర్‌లో దగ్గుబాటిపురం గ్రామస్తులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఎన్నికలైన రెండు నెలలకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానని కబురు పంపినా కూడా తాము వెళ్లలేదని చెప్పారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. తాను ఓడిపోయినా, గెలిచినా రాష్ట్రానికి, గ్రామాలకు మంచి పని చేయడమే తన ఉద్దేశమని తెలిపారు. కొన్నిమార్లు తాము రాజకీయాల్లో నుంచి ఉపసంహరించుకుందామని ఆలోచన కూడా వచ్చిందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

➡️