శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలా..?

Feb 28,2024 12:04 #anakapalli, #cpm, #Jagananna Colony
Jagananna colony in the graveyard

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో దాదాపుగా 16 కుటుబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ క్రింద ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. సౌకర్యాలు నిమిత్తం విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్, బోరు, మంచి నీటి కోళాయిలు లాంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. లబ్దిదారులు మాత్రం ఇల్లు నిర్మాణం ప్రారంబించలేదు. బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర లేఆవుట్ ను పరీశీలించి హాసింగ్ నిర్వాహణ చేపాట్టకపోవడంపై లబ్దిదార్లును అరా తీసారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కోసమే స్థలాలు ఇచ్చారని, నిజానికి లబ్దిదారులకు ఇక్కడ ఇల్లు స్థలాలు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపారు. శ్మశాన వాటికలో ఇస్తే ఎలా నిర్మించుకుంటారని బదులు ఇచ్చారు. అనంతరం వెంకన్న దొర విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం చాల ప్రాంతాల్లో ఇటువంటి పనులే చేసి ప్రజాధనంను వృదా చేసిందని అగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వెంకటరాజపురం వేచలం బి కింతాడ కలిగోట్ల కాశిపురం అలమండ గ్రామాల్లో మరిదారునంగా స్తలాలు ఇచ్చారని ఏ ఒక్క లబ్దిదార్లు ఇల్లు నిర్మించుకోలేదన్నారు. మరి కొన్ని గ్రామాల్లో చెరువుల్లోను శ్మశాన వాటికలోను రహదార్లు లేని చోట ఊరికి దూరంగాను ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని తెలిపారు. మారేపల్లితో పాటు అనేక గ్రామాల్లో అడ్డగోలుగా ఇల్లు స్థలాలు ఇచ్చి ప్రజా ధనం వృదా చేసి లబ్దిదార్లును మోసం చేసారని వారు తెలిపారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పెరోజులు దగ్గర పడ్డాయని వారు స్పష్టం చేశారు.

➡️