మంత్రి అమర్‌నాథ్‌కి ఝలక్‌

Feb 22,2024 13:14 #Minister Gudivada Amarnath

విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ఝలక్‌ ఇచ్చింది. ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి ప్రభుత్వం ఆయనను తప్పించింది. ఈ నెల 22వ తేదీ (గురువారం)న విశాఖకు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి.. ఆ బాధ్యతను ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఈ బాధ్యతల నుంచే కాదు.. అమర్‌నాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ బాధ్యునిగా కూడా వైకాపా అధిష్టాం ఇటీవల ఆయనను తొలగించి.. మరొకరిని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. అమర్‌నాథ్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారో కూడా వైకాపా అధిష్టానం ఇప్పటివరకూ ప్రకటించలేదు. దీంతో రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

➡️