జూనియర్ డాక్టర్ల ర్యాలీ 

Dec 28,2023 11:45 #junior doctors, #Protest, #Vizianagaram
jounior doctors protest in vzm

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

జీతం లేనిదే జీవితం లేదు…

ప్రజాశక్తి-విజయనగరం కోట : బుధవారం నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్టైఫడ్ కోరుతూ ధర్నా చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ వరకు కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఎం ఎం జి ప్రకారం మేము విధులు నిర్మిస్తూ విధులు నిర్వహిస్తున్న  తమకు స్టైఫండ్ గత ఏడు నెలల నుంచి ఇవ్వటం లేదని ఆగ్రహించారు. ఈ స్టైఫండ్ లేకపోవడం వల్ల జీవితం ఇబ్బందిగా ఉందని తెలిపారు. జీతం లేనిదే జీవితం లేదన్నారు. పనికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదన్నారు.

➡️