ఎసిఎ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసరుగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎసిఎ) అంబుడ్స్‌మన్‌గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఎసిఎ ఎథిక్స్‌ ఆఫీసరుగా కూడా ఆయన ఉంటారు. ఏడాదిపాటు ఆ పదవులను స్వతంత్రంగా నిర్వహిస్తారు. జస్టిస్‌ చాగరి సేవలను వినియోగించుకోవాలని ఇటీవల ఎసిఎ కార్యవర్గం తీర్మానం చేసింది. ఇందుకు జస్టిస్‌ చాగరి సమ్మతిని తెలియజేశారు.

➡️