చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలి -ఎన్‌హెచ్‌ఆర్‌సికి కనకమేడల లేఖ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలని టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ కోరారు. మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కి టిడిపి మాజీ ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ లేఖ రాశారు. పెన్షనర్ల పంపిణీలో మార్పుల వల్ల 33 మంది పెన్షనర్లు మరణించారని లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో వైసిపి ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన సిఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశిభూషణ్‌ కుమార్‌, సెర్ప్‌ అధికారి మురళీధర్‌రెడ్డిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పెన్షనర్లు మరణించారని, రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. చనిపోయిన పెన్షనర్లకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.

➡️