బిఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కెసిఆర్‌

Dec 10,2023 08:23 #BRS legislative leader, #KCR

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎన్నుకున్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్‌ నేత కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎల్‌పి నేతగా కెసిఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకొని బిఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే. కెసిఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గన్నారు. ఎల్‌పి సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్లారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీకి కెటిఆర్‌, పద్మారావు, ముఠా గోపాల్‌ హాజరుకాలేదు.

➡️