ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణస్వీకారం

Jan 28,2024 12:04 #February, #First, #KCR, #MLA

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ ఫిబ్రవరి 1న గజ్వేల్‌ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కు లేఖ రాశారు. గత డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే కెసిఆర్‌ ప్రమాదవశాత్తు కిందపడి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే గురువారం శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

➡️