కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనుకు బెయిల్‌ మంజూరు

Feb 9,2024 10:46 #AP High Court, #kodi kathi case

ప్రజాశక్తి-అమరావతి : గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌ పోర్టులో ముఖ్యమంత్రి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీనివాస్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. శ్రీను బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్‌ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. వారానికి ఒక రోజు ట్రయల్‌ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది.

➡️