కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి (తెలంగాణ) : యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్‌ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన శబ్దం రావడంతో గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమయంలోనే రైలును రైల్వే అధికారులు ఆపారు. ఆలేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ పైన రైల్‌ పట్టా విరిగిపోవడంతో గమనించి అధికారులు మరమ్మతులు చేశారు. ఈ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

➡️