సిపెట్‌ దరఖాస్తుకు చివరి తేదీ 31

May 23,2024 20:45 #CIPET application, #invites

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డిపిటి), డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డిపిఎమ్‌టి), బిఎస్‌సి విద్యార్థులకు 2 సంవత్సరాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ అనే కోర్సులను సిపెట్‌ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) విజయవాడలో అందిస్తున్నట్లు ఆ కళాశాల జాయింట్‌ డైరెక్టరు సిహెచ్‌ శేఖర్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు కళాశాల ఆవరణలోనే విడివిడిగా హాస్టల్‌ వసతి, నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాలు ఉన్నాయని, ఆసక్తి గలవారు సిపెట్‌24.ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ఫామ్‌.ఒఆర్‌జి/సిపెట్‌ అనే లింక్‌ ద్వారా ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ను జూన్‌ 9న విజయవాడ, అనంతపురంలో నిర్వహించి ర్యాంకు ఆధారంగా విజయవాడ కేంద్రంలో గల 150 సీట్లను భర్తీ చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9398535697 నెంబరును సంప్రదించాలన్నారు.

➡️