ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌

ఏలూరు : ఏలూరులో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌ ఆదివారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ వె. ప్రసన్న వెంకటేష్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్య వేణి, డిఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. వట్లూరు సమీపంలోని హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్‌ నుంచి ప్రారంభమైన 3 కే రన్‌ సత్రంపాడు సర్‌ సి. అర్‌.రెడ్డి కళాశాల ,జడ్పీ కార్యాలయం మీదుగా ఇండోర్‌ స్టేడియంకు చేరుకుంది.

➡️