కలిసి పనిచేస్తాం : సుజనా చౌదరి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన నాయకులను కలుపుకుని పనిచేస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 4 కోట్లు ఇళ్లు ఇచ్చామన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను విజయవాడకు చెందిన వాడినేనని అన్నారు. జనసేన నేత పోతిన మహేష్‌కు ఆవేదన ఉండొచ్చని, ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ చూసుకుంటారని పేర్కొన్నారు.

➡️