సెంటర్ జైల్లో గిరిజన ఖైది అనుమానాస్పద మృతి

Feb 7,2024 17:02 #AP police, #Crimes
lock up death in visakha

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ సెంటర్ జైల్లో గిరిజన ఖైది అనుమానాస్పదంగా మృతి చెందాడు.  మృతిపై అతని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ కేజిహెచ్ మార్చ్యురి  దగ్గర ఆందోళన చేపట్టారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గిరి పుత్రులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని గిరిజనులు హెచ్చరించారు.

➡️