మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని భరించలేమంటున్నL&T

Dec 16,2023 10:49 #Irrigation Projects, #Telangana, #water

హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని తాము భరించలేమని నిర్మాణ సంస్థ L&T స్పష్టం చేసింది. దెబ్బతిన్న పియర్స్‌, కుంగిన బ్యారేజీ పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అక్టోబర్‌ 21న బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా ఉందని, ఖర్చును తామే భరిస్తామని చెప్పిన L&T ఇప్పుడు దానికి భిన్నంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. రిపేర్లకు రూ.500 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

➡️