మహిళపై సామూహిక లైంగికదాడి..

Jan 2,2024 12:11 #Sexual Assaults
  •  నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

నోయిడా : నోయిడాలోని ఓ షాపింగ్‌మాల్‌ సమీపంలో 26 ఏళ్ల మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన గతంలోనే జరగ్గా బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితులు ‘ప్రభావశీలురు’ అని పోలీసులు తెలిపారు. బాధితురాలిపై గతంలో సామూహిక లైంగికదాడికి పాల్పడినవారు డిసెంబరు 30న మరోమారు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిని రాజ్‌కుమార్‌, ఆజాద్‌, వికాస్‌గా గుర్తించారు. రవి, మేహ్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అరెస్ట్‌ అయిన నిందితులకు స్థానిక కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

➡️