మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. 164 పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. cse.ap.gov.in లేదా apms.apcfss.in/studentlogin.do వెబ్‌సైట్ల ద్వారా హాల్‌ టికెట్‌ నెంబరుతో ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అడ్మిషన్ల కోసం సంబంధిత మోడల్‌ స్కూల్స్‌లో సంప్రదించాలని కోరారు.

➡️