అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌ జెఎన్‌టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడుతూ … వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించానన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కఅషి చేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్‌ – 3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని చెప్పారు. పరాజయాలు అధిగమించి 3 ప్రాజెక్టుల్లో విజయం సాధించామని హర్షాన్ని వ్యక్తం చేశారు. తన జీవితంలో రాకెట్‌ రూపకల్పనలో తానూ ఎన్నో తప్పులు చేశాననీ.. అపజయం గెలుపునకు పాఠం లాంటింది అని సోమనాథ్‌ అన్నారు.

➡️