వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరు..!

Jan 11,2024 12:46 #JanaSena, #Mudragada, #TDP
  • ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు

ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని, జనసేన, లేదా టీడీపీలోకి వెళ్లే ఛాన్స్‌ ఉందని తెలిపారు. తాము ఇద్దరం పోటీకి సిద్దాంగా ఉన్నామని, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కాకినాడ పార్లమెంట్‌, పిఠాపురం, ప్రత్తిపాడులో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా నిన్న జనసేన నేతలు ముద్రగడ భేటీ అవ్వగా.. నేడు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిశారు.

➡️