విశాఖలో మున్సిపల్‌ కార్మికుల సభ

municipal workers strike temporary stop

ప్రజాశక్తి-విశాఖ :  మున్సిపల్‌ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, సిఐటియు నాయకులు ఆర్ కే ఎస్ వి కుమార్, మున్సిపల్ నాయకులు నూకరాజు, ఊరుకోట్ రాజు, సిపిఎం మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ, వి కృష్ణారావు, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

➡️