ఏపీలో మహిళలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

Apr 21,2024 11:45 #Nara Brahmani, #paryatana

మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దఅష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్‌ తొలగించారని మహిళలు వాపోయారు. పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నారా బ్రాహ్మణి వారికి హామీ ఇచ్చారు.

➡️