జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

nara lokesh on ycp govt

ప్రజాశక్తి-మంగళగిరి : ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్క‌రించి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోన్న జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ హ‌క్కుల‌కి దిక్కులేదని విమర్శించారు. నిల‌దీస్తే నిర్బంధమని మండిపడ్డారు. స‌ర్కారు అవినీతి, అరాచ‌కాల‌ని ప్ర‌శ్నిస్తే ప్రాణాలు తీసిన‌ జ‌గ‌న్ ఆట‌విక పాల‌నని అంత‌మొందించేందుకు ప్ర‌జ‌లు ఉద్య‌మించాలని తెలిపారు. జ‌గ‌న్ నేర, క్రూర పాల‌న‌కి బ‌లైన వారంద‌రికీ క‌న్నీటి నివాళులని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్య విలువ‌లు కాపాడ‌టానికి, అంబేద్క‌ర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప‌ని చేస్తున్న మ‌హానుభావులు, ప్ర‌జ‌ల‌కు రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

➡️