వైసిపి హయాంలో అభివృద్ధి శూన్యం

Mar 28,2024 23:46 #nara bhuvaneswari, #speech

– ‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి
ప్రజాశక్తి – యంత్రాంగం :వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని, అవినీతి, మద్యం, ఇసుక, మాదకద్రవ్యాలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. ‘నిజయం గెలవాలి’ యాత్రలో భాగంగా ఆమె గురువారం ఏలూరు, కృష్ణా జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో బెజవాడ రామారావు, ఆగిరిపల్లిలో పల్లగాని చంద్రయ్య, కలవకొల్లు శ్రీరాములమ్మ, నూజివీడు మండలం గొల్లపల్లిలో వెనిగళ్ల పూర్ణచంద్రయ్య కుటుంబాలను పరామర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో గుండెపోటుతో మృతి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అభివఅద్ధి చెందాలన్నా, నిజం గెలవాలన్నా చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు.

➡️