పేరు మార్పులో ఎవరి బలవంతం లేదు : ముద్రగడ

ప్రజాశక్తి – కిర్లంపూడి (కాకినాడ) : ఎవరి ఒత్తిడితోనో పేరు మార్పుకు దరఖాస్తు చేసుకోలేదని, కేవలం తన సొంత నిర్ణయంతోనే పేరు మార్పు చేసుకున్నానని ముద్రగడ తెలిపారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత వైసిపి నాయకుడు ముద్రగడ పద్మనాభం శుక్రవారం కిర్లంపూడిలోని తన నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికలకు ముందు వైసిపి లో చేరిన తర్వాత పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్‌ చేశారు. జరిగిన ఎన్నికల్లో పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ అధిక మెజారిటీతో గెలవడంతో ఎన్నికల అనంతరం ముద్రగడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను చేసిన సవాల్‌ లో భాగంగా పిఠాపురంలో పవన్‌ గెలవడంతో తన పేరు మార్పు కోసం గెజిట్‌ కు దరఖాస్తు చేసుకుంటున్నానని గతంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. తాజాగా ముద్రగడ గెజిట్‌ కోసం చేసుకున్న దరఖాస్తు ఆమోదం పొందిందని పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నట్లు ముద్రగడ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ … ఎవరి ఒత్తిడితోనో పేరు మార్పుకు దరఖాస్తు చేసుకోలేదని, కేవలం తన సొంత నిర్ణయంతోనే పేరు మార్పు చేసుకున్నానని ముద్రగడ తెలిపారు. ప్రత్యేక హోదా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ కఅషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి కాబట్టి కాపులకు న్యాయం చేయండంటూ పేర్కొన్నారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని, పవన్‌ కళ్యాణ్‌ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదని ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. తన కుటుంబాన్ని జనసైనికులతో దాడులు చేయించి తమను చంపేయండని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇలాంటి దాడులు చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని, ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్‌ కళ్యాణ్‌ టిడిపి పార్టీకి సూచనలు చేయాలని కోరారు.

➡️