నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ బూత్‌ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్‌ నమోదవుతుందని వివరించారు. నాగార్జున సాగర్‌ గొడవపై రాజకీయ నేతలకు కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలివేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాగా, నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి టెన్షన్‌ నెలకొన్న విషయం తెలిసిందే.

➡️