కిడ్నాప్‌ కేసులో దస్తగిరికి నోటీసు – ఇంటికి అంటించిన పోలీసులు

Dec 23,2023 09:06 #dastagiri, #notice

ప్రజాశక్తిాపులివెందుల టౌన్‌మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌ షేక్‌ దస్తగిరికి, ఆయన భార్య షబానా పేరు మీద కిడ్నాప్‌ కేసుకు సంబంధించి శుక్రవారం పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులో ఎటువంటి తేదీలు, క్రైం నంబర్‌, విచారణకు హాజరు కావాల్సిన సమయమూ లేదు. తమ కుమారున్ని కిడ్నాప్‌ చేసి డబ్బులు ఇవ్వాలంటూ దస్తగిరి, ఆయన భార్య షబానా బెదిరిస్తున్నారని అదే వీధిలో ఉంటున్న గూగుడు వల్లి, కళావతి మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీస్‌ అధికారులు కేసు నమోదు చేశారు. దస్తగిరి ఇప్పటికే వేరే కేసులో కడప సబ్‌ జైల్‌లో ఉండగా, షబానా వ్యక్తిగత పనిమీద బయటి ఊరికి వెళ్లారు. దీంతో, ఇంటికి 41ఎ, 41బి కింద నోటీసులు అంటించారు. ఊరి నుంచి వచ్చిన షబానా పక్కింటి వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు. విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో ఉంది.

➡️