జనసేనకు ఓటేసుకోని పవన్

May 13,2024 16:27 #pavan

మంగళగిరి : జనసేన పార్టీ అధినేత, పిఠాపురంలో టిడిపి, బిజెపి బలపర్చిన కె.పవన్‌కళ్యాణ్‌ తన పార్టీ గుర్తుకు ఓటేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఓటు మంగళగిరిలోని లక్ష్మీనరసింహకాలనీలో నమోదైవుంది. దీంతో ఉదయాన్నే ఆయన భార్య అన్నాలెజినోవాతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. మంగళగిరి అసెంబ్లీ, గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో జనసేన పోటీలో లేకపోవటంతో ఆయన పార్టీ గుర్తుకు ఓటేసుకోలేకపోయారు. కూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీలో ఉండటంతో ధర్మాన్ని నెరవేర్చాడనే చర్చ జరుగుతోంది.

➡️