కేంద్రంపై పెన్షనర్ల ఆగ్రహం

Dec 20,2023 15:18 #Pensioners, #Protest
pensioners protest in visakha

ప్రజాశక్తి-విశాఖ : అల్ ఇండియా పెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ యూనియన్  (విశాఖ కమిటీ) ఆధ్వర్యంలో ఇపియస్ 95 పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొద్ది సేపు గాంధీ విగ్రహం సమీపంలో రాస్తారోకో చేపట్టారు. కనీస పెన్షన్ వెంటనే పెంచాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఆర్ పిఎ రాష్ట్ర కమిటీ సభ్యులు కెపి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వై అప్పారావు, రామప్రభు, సూర్య చంద్రరావు, ట్రెజరర్ రంగా, మూర్తి , ఎస్ చలపతిరావు, బివివి రమణ, మోహనరావుతదితరులు పాల్గొన్నారు.

pensioners protest in hyd

హైదరాబాద్ లో నిరసన తెలుపుతున్న పెన్షనర్లు…

➡️