రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి : చంద్రబాబు 

  •  చిత్తూరులో వితంతు మహిళ వైసీపీ మూకల దాడి

ప్రజాశక్తి-మంగళగిరి : వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందని టిడిపి అధినేత  చంద్రబాబు ఆగ్రహించారు. చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా… వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. భర్త లేకపోయినా… దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యం అయిన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు.

➡️