‘ప్రకాశం’వంతంగా బాలోత్సవం

Feb 9,2024 12:49 #Balotsavam, #Prakasam District

ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నగర మేయర్ గంగార సుజాత ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చే సంవత్సరానికి మరింత మంది విద్యార్థులతో కార్యక్రమం వైభవంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లాలో బాలోత్సవం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థుల నాటిక పోటీలు, డాన్స్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పిల్లల ఏకపాత్రాభినయం నిర్వహించారు. పలు రకాల వేదికల మీద విద్యార్థులు వీటిని ఆసక్తిగా తిలకించారు.

➡️