‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

Feb 21,2024 11:07 #vizag steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశంలోని ప్రతి ఉద్యోగి బాధ్యతని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1104వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ ఇఎస్‌ అండ్‌ ఎఫ్‌, ఎఫ్‌ఎండి, ఇఆర్‌ఎస్‌, సేఫ్టీ, టెక్‌, ఎస్‌ఎసిడి, ఆగ్రో విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ మాట్లాడారు. ఏకతాటిపై జరుగుతున్న ఉక్కు పరిరక్షణ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సి ఉందన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని చూస్తున్న కేంద్ర బిజెపిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరారు.

➡️