నేడు 134 మండలాల్లో వడగాడ్పులు

Apr 10,2024 07:49 #andrapradesh, #sun burning
  •  విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 134 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్లు నిర్వహణ సంస్ధ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ నెల 11న 16 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 92 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నాడు తీవ్ర వడగాడ్పులు వీచే మండలాలు మన్యం జిల్లాలో 2, శ్రీకాకుళంలో 8, విజయనగరం జిల్లా వేపాడ ఉన్నాయి. వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళంలో 17, విజయనగరంలో 25, అల్లూరి సీతారామరాజులో 10, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 16, కాకినాడలో 10, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 4, ఏలూరులో 7, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాలో 2, పల్నాడు, అమరావతి మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు.

➡️