ఏపీ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ర్యాలీ

Jan 9,2024 16:50 #Rally, #sachivalaya employees

అమరావతి: ఏపీ సచివాలయంలో సెక్రటేరియట్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సీఎస్‌ను కలిసి విజ్ఞపన పత్రం ఇస్తామంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదని చెప్పడంతో ఒకటవ బిల్డింగ్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపైనే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు బైటాయించారు. కొందరు అధికారులను ఓసీ, బీసీ ఉద్యోగుల సంఘం ప్రభావితం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే వారు సచివాలయంలో ర్యాలీలు కూడా నిర్వహించారని, ఓసీ, బీసీ ఉద్యోగులు కావాలని కోందరు ఉద్యోగులను నమ్మించి ర్యాలీలో పాల్గోనేలా చేశారని మండిపడ్డారు. ప్రమోషన్లపై మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ రిపోర్టు సరిగా లేదని, కాబట్టి సీనియర్‌ ఐఏఎస్‌ ల కమిటీని వెంటనే వేయాలని విజ్ఞప్తి చేశారు.”సచివాలయంలో స్నేహ పూర్వక వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలి అని విజ్జప్తి చేస్తున్నాం. సచివాలయంలో ఐఏఎస్‌ కమిటీ వేయాలి, సచివాలయంలో ఎస్సీ, ఎస్టీలను ఒక వైపు మిగిలిన వారు అంతా ఓ వైపు ఉంటున్నారు. ప్రభుత్వం తిరిగి గతంలో ఉన్న స్నేహ పూర్వక వాతవారణాన్ని నెలకోల్పాలి. సచివాలయంలో సుహ్రుద్బావ వాతావరణాన్ని ఓసీ, బీసీ ఉద్యోగులు సంఘం దెబ్బతీస్తోంది. కావాలని ఆ సంఘం తరపున ర్యాలీలు చేస్తున్నారు. అలాంటి ర్యాలీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సచివాలయంలో ఇరువైపులా ఉద్యోగులను సమంగా చూడాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉంది. ఈ వ్యవహారంపై లేఖను సీఎస్‌ జవహర్‌ రెడ్డి కార్యాలయంలో ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అసోషియేషన్‌ సభ్యులు అందించాం.” అని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తెలిపారు.

➡️