Rave Party: కీలక ఆదేశాలు

May 25,2024 13:41 #Rave Party

బెంగుళూరు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 27వ తేదీన విచారణకు హాజరు కావాలని 86 మందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందిని ప్రశ్నించనున్నారు.  రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడ నుండి వచ్చాయన్న దానిపై విచారణ చేపట్టనున్నారు. బెంగళూరు సిసిబి ముందు హాజరు కావాలని సినీనటి హేమాతో పాటు 86 మంది బెంగళూరు పోలీసులు నోటిసులు జారీ చేశారు.

➡️