‘రియల్‌’ దారెటు?

May 23,2024 00:50 #the 'real'?, #Where

విశాఖవైపా… అమరావతిలోనా
రెరడుచోట్లా భూ లావాదేవీలపై ఆరా
నాలుగో తేదీ కోసం ఎదురుచూపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్రంలో నిర్లిప్తంగా సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భవిష్యత్‌ దారెటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రియల్‌ బూమ్‌ మందగించింది. అమరావతి, విశాఖపట్నం మధ్య రాజధాని అంశం తిరుగుతుండడంతో రియల్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో రియల్‌ వ్యాపారం పడకేసింది.
2019 వరకు అమరావతి ప్రారతంలో నిర్మాణ రంగం పెద్ద ఎత్తునే సాగిరది. ఇంకో ఏడాది గడిస్తే మరిరతగా అభివృద్ధి సాధిస్తుందన్న భావన వ్యక్తమవుతున్న తరుణంలోనే పాత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రకటన రావడంతో అమరావతి ప్రారతంలో నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే విశాఖలో కూడా నిర్మాణ రంగం పెద్దగా పుంజుకోలేదు. కొరతమంది బడా వ్యక్తులు, రాజకీయ ప్రాబల్యం ఉన్న వారు విశాఖ చుట్టుపక్కల పెద్ద మొత్తంలోనే భూములు కొనుగోలు చేశారు. కబ్జాలూ ఎక్కువగానే జరిగాయి. అయితే ఈ భూముల్లో కూడా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ భూములు ఖాళీగానే ఉండిపోయాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ చుట్టుపక్కల రియల్‌ రంగం ఊపందుకుందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ప్రభుత్వం మారి మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెరిగి నిర్మాణ రంగం పుంజుకుంటుందని రియల్టర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరదుకే జూన్‌ నాలుగో తేదీన వచ్చే ఫలితాల కోసం రియల్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగానే ఇరు ప్రాంతాల్లో భూముల పరిస్థితి, పెరిగే భూముల విలువ, అక్కడ అభివృద్ధి ఉన్న అవకాశాలు వంటివాటిపై రియల్‌ వ్యాపారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇవేఅంశాలపై పక్క రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే అధికారంలోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుందని, కూటమి నేతృత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తే అమరావతిలో రియల్‌ రంగం బాగుంటుందన్న భావాన్ని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.

➡️