వైసిపి నాలుగో జాబితా విడుదల

Jan 19,2024 10:09 #four, #list, #release, #YCP
  • చిత్తూరు ఎంపి అభ్యర్థిగా నారాయణ స్వామి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో పోటీలో నిలిపే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఈ జాబితాలో ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను ప్రకటించారు. రాష్ట్ర ఎక్సయిజ్‌శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా నియమించారు. అలాగే అసెంబ్లీలకు సంబందించి నెల్లూరు గంగాధర నియోజకవర్గం నుండి ఎన్‌ రెడ్డప్ప, శింగనమల నుండి ఎం వీరాంజనేయులు, నందికొట్కూరుకు డాక్టర్‌ దారా సుదీర్‌, తిరువూరుకు నల్లగట్ల స్వామిదాస్‌, మడకశిరకు ఈర లక్కప్ప, కొవ్యూరుకు తలారి వెంకట్రావ్‌, గోపాలపురానికి తానేటి వనిత, కనిగిరికి దద్దాల నారాయణయాదవ్‌ను నియోజకవర్గ ఇంచార్జీలుగా నియమించారు.

➡️