గోపాలపురం (తూర్పు గోదావరి) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. గురువారం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.