జనవరి నుంచి వలంటీర్లకు రూ.750 వేతనం పెంపు : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి- తిరుమల : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ.750 వేతన పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సిఎం జగన్‌ పుట్టిన రోజు కానుకగా ఆయన ఈ ప్రకటన చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం వలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం వస్తోంది. సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా వలంటీర్ల వేతనం అదనంగా రూ.750 ఇవ్వబోతున్నాం. జనవరి ఒకటి నుంచి పెంచిన వేతనాన్ని వారు అందుకుంటారు. మొత్తం 5,750 అవుతుంది. ప్రజలకు రేషన్‌ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో వలంటీర్లు మరింత మంచి చేసే అవకాశాన్ని సిఎం జగన్‌ కల్పిస్తారు.’ అని మంత్రి తెలిపారు.

➡️