ప్రబీర్‌ పుర్కాయస్థ అక్రమ అరెస్టుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సభ.. లైవ్‌

May 18,2024 18:15 #book released, #Vijayawada

ప్రజాశక్తి – విజయవాడ : ప్రబీర్‌ పుర్కాయస్థ అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిసూ శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ గవర్నరుపేటలోని బాలోత్సవ్‌ భవన్లో సభ జరుగుతుంది. ఈ సభలో వక్తలుగా ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నుపాటి దివాకర్‌ బాబు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రబీర్‌ పుర్కాయస్థ ఆత్మకథ ‘అలుపెరుగని పోరాటం’ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పుస్తకాన్ని పిడిఎఫ్‌ శాసన మండలి సభ్యులు కె.ఎస్‌. లక్ష్మణరావు ఆవిష్కరిస్తారు. ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పూర్వ సంపాదకులు కె.ఉషారాణి పరిచయం చేస్తారు. సాంస్కృతిక కార్యకర్త గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు), రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిఆర్కె – పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరుగుతుంది.

➡️