తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Mar 4,2024 15:44 #samantha, #Tirumala, #ttd

ప్రజాశక్తి-తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్‌ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సమంతను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సమంతను చూసిన అభిమానులు దగ్గరకు వచ్చి పలకరిస్తూ, ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

➡️