మున్సిపల్‌ వర్కర్స్‌కు ‘సంక్రాంతి’ కానుక

  • జిఓ 12 విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులకు సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన సంక్రాంతి కానుక రూ.వెయ్యికి సంబంధించిన జిఓ ఎంఎస్‌ నెంబరు 12ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. జిఓ విడుదల పట్ల ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగభూషణం, ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సమ్మెకాలం వేతనం రూ.21 వేలతోపాటు రూ.24,500 వేతనంతో సహా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించే జిఓలను కూడా త్వరగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

➡️