చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

చద్రగిరి: ఏపీలో పోలింగ్‌ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 7కు పైగా కేసులు నమోదు చేశారు . ఇరు పార్టీలలో 40 మందికి పైగా ముద్దాయిలను పోలీసులు గుర్తించారు. పులివర్తి నానిపై దాడి కేసులో ఇప్పటికే 13మందిని అరెస్ట్‌ చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలింగ్‌ రోజు బ్రాహ్మణ కాల్వలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. నానిపై దాడి సమయంలో మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర నాని గన్‌ మాన్‌ 2 రెండ్లు కాల్పులు జరిపారు. ఈ కమ్రంలోనే.. నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. అరెస్ట్‌ ల భయంతో కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వర్శిటీ వద్ద సీఐ పై దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. నేటి మధ్యాహ్నం నుంచి సిట్‌ బఅందం విచారణ కొనసాగే అవకాశం ఉంది.

➡️